వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో ఏడాదిలోపు చిన్నారులతో వచ్చే భక్తులకు తిరుమల తరహాలో ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని, తల్లిదండ్రులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.
సేవా టిక్కెట్ల సమయంలో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

