వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని ఘంటసాల విగ్రహం వద్ద రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎస్పీ బాలు మధుర గానం, సినీ సంగీతానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అభిమానులు కొనియాడారు. ఆయన స్వరం తరతరాలకు స్ఫూర్తినిస్తూ సంగీత ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోతుందని ఛైర్మన్ గోపీనాథ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

