వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా కార్యాలయాన్ని జేఏసీ ఛైర్మన్ గజ్జల దేవరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఉచిత బస్సు ప్రయాణం, రూ.25 వేల పెన్షన్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కల్పించాలని దేవరాజు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

