Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

Follow Udayam on Google
Sircilla jilla news Sep 21, 2026 4:08 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు - Udayam
సిరిసిల్లలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆయన వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా నిలిచారని అన్నారు. పద్మశాలీల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ నెల 27న జయంతి వేడుకలను నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...