వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన రాజాగౌడ్ కుటుంబానికి మంజూరైన సీఎం సహాయనిధి రూ. 30 వేల చెక్కును సోమవారం అందజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు.
ఇటీవల రాజాగౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దశరథం, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

