వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్‌లో ఆరుగురి దారుణ హత్యల కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గతంలో పోక్సో కేసున్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌పై కఠిన చట్టాలు ప్రయోగించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసును నీరుగార్చారంటూ స్థానికులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ ప్రజా ఆగ్రహం వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు స్పందించి ఎస్‌ఐ రమేశ్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

