Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:53 PM తిరుపతిGeneral
శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి - Udayam
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...