వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ నుంచి ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదకరంగా ప్రయాణిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తాలకు తాళ్లు కట్టకుండా, కవర్లు వేయకుండా తరలిస్తుండటంతో వెనుక వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బస్తాలు జారిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, అధికారులు స్పందించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

