వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని ఈస్ట్ బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన శివాజీ గణేష్ మండలి గణనాథున్ని బీఆర్‌ఎస్ నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండలి 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మహా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు జగన్‌ను శాలువాతో సన్మానించారు. యువత, చిన్నారులు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

