వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని మిస్సింగ్ లింక్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడటంతో కలంబోలి పరిధిలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలంలో శిథిలాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా పుణె వైపు వెళ్లే వాహనాలన్నింటినీ అధికారులు పాత ముంబై-పుణె హైవే వైపునకు మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, హైవే సిబ్బంది సూచనలను పాటించాలని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

