వార్తలకు తిరిగి వెళ్లండి
సోమశిలలో సఫారీ సందడి

నల్లమల అడవులు, కృష్ణా తీర అందాలను వీక్షించేందుకు సోమశిల అర్బన్ పార్కులో అటవీశాఖ సఫారీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకుల కోసం రూ.800 ప్యాకేజీతో ఆరుగురు వెళ్లేలా వాహనాలను సిద్ధం చేశారు.
సుమారు 5 కి.మీ. మేర సాగే ఈ ప్రయాణంలో పర్యాటకులు నల్లమల ప్రకృతిని, వాచ్ టవర్ నుంచి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ సేవలు ప్రారంభం కావడంతో పర్యాటక రంగం మరింత పుంజుకోనుంది.
Comments
Loading comments...