Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట-బిక్కవోలు మార్గం పునరుద్ధరణ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:13 PM కాకినాడGeneral
సామర్లకోట-బిక్కవోలు మార్గం పునరుద్ధరణ - Udayam
సామర్లకోట నుంచి బిక్కవోలు వెళ్లే కెనాల్ రహదారిపై వరద నీరు తగ్గడంతో గురువారం వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం వేట్లపాలెం-హుస్సేన్‌పురం మధ్య రోడ్డుపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. దీంతో బైక్‌లు, ఆటోల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నీరు పూర్తిగా తగ్గడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...