వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా ఐరాల మండలం అబ్బుగుండు గ్రామస్థులు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు.
తమ సమస్యలు పరిష్కరించే వరకు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయబోమని స్పష్టం చేస్తూ నిరసన తెలిపారు.
Comments
Loading comments...

