వార్తలకు తిరిగి వెళ్లండి

భారత త్రివిధ దళాల బలోపేతానికి రూ.2.12 లక్షల కోట్ల సైనిక సామగ్రి కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హెలికాప్టర్లు, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేయనున్నారు. నౌకాదళ రక్షణ పరికరాలకూ ఆమోదం లభించింది. మొత్తం కొనుగోళ్లలో 82 శాతం దేశీయంగానే చేపట్టనున్నారు.
Comments
Loading comments...

