వార్తలకు తిరిగి వెళ్లండి
టీజీ20 లీగ్‌లో రైజర్స్ విజయకేతనం
శివ కుమార్ Jun 23, 2026 7:09 AM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago

టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ జట్టు ఘనమైన శుభారంభం చేసింది. సోమవారం నల్గొండ నైట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నల్గొండ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని రైజర్స్ ఇంకా 21 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ కేవలం 30 బంతుల్లో 71 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచారు. కాగా, మంగళవారం రాత్రి జరగబోయే తదుపరి మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కన్స్ జట్లు తలపడనున్నాయి.
Comments
Loading comments...