Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీపై వినతి

వైష్ణవి శర్మ Jul 14, 2026 5:25 PM భద్రాద్రి కొత్తగూడెం 5 viewsabout 2 hours ago
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీపై వినతి - Udayam Digital
బూర్గంపహాడ్ మండలంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో అక్రిడేటెడ్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యుజే(ఐజేయూ) ప్రతినిధులు ఎంఈఓ యదుసింహరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, మండలంలో కూడా వాటిని తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఎంఈఓ, ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...