Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు ఊరట: మరో రూ.2 వేల కోట్ల విడుదల

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jun 30, 2026 6:38 AM హైదరాబాద్General
ఉద్యోగులకు ఊరట: మరో రూ.2 వేల కోట్ల విడుదల - Udayam
ఉద్యోగులు, పింఛన్‌దారుల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేసింది. నెలాఖరులోగా మొత్తంగా రూ.4 వేల కోట్ల నిధులను విడుదల చేయడం ద్వారా తమ చిత్తశుద్ధిని ప్రభుత్వం నిరూపించుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను వంద శాతం చెల్లించడమే కాకుండా, సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా పూర్తి చేసింది. మిగిలిన బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తామని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...