Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు భైంసాలో పటిష్ట భద్రత: ఎస్పీ

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 6:49 PM నిర్మల్General
రేపు భైంసాలో పటిష్ట భద్రత: ఎస్పీ - Udayam
భైంసా పట్టణంలో మంగళవారం జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం పట్టణంలో పోలీస్ సిబ్బందితో రూట్ మార్చ్ నిర్వహించారు. శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలు, కూడళ్లు, సున్నిత ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...