Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్ కార్డు మోసాలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jun 26, 2026 4:44 PM జాతీయంGeneral
క్రెడిట్ కార్డు మోసాలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు - Udayam
సైబర్ మోసాల బాధితులకు ఊరటనిస్తూ ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేస్తే, బ్యాంకులు 5 పని దినాల్లోగా వివాదాస్పద మొత్తాన్ని ఖాతాలో తిరిగి జమ చేయాల్సి ఉంటుంది. దీనిని 'షాడో రివర్సల్' విధానంగా పిలుస్తారు. విచారణ పూర్తయ్యే వరకు కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టారు. అయితే దర్యాప్తులో ఫిర్యాదు తప్పుగా తేలితే, బ్యాంకులు ఆ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...