వార్తలకు తిరిగి వెళ్లండి

రైవాడ జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు నీటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాటికి నీటిమట్టం 113.50 మీటర్లకు చేరగా, ప్రస్తుతం 1,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కావడంతో స్పిల్‌వేలో ఒక గేటు తెరిచి 1,000 క్యూసెక్కుల నీటిని శారదా నదిలోకి విడుదల చేయనున్నారు. నది దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DEE సత్యంనాయుడు సూచించారు.
Comments
Loading comments...

