వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నాతయ్యపాలెం చెరువులో సోమవారం తెల్లవారుజామున కారు బోల్తా పడిన ఘటనలో కిల్లి వరుణ్ కుమార్ (26) మృతి చెందాడు. నాతయ్యపాలెంలో నివాసం ఉంటున్న వరుణ్ కారు నడుపుతూ చెరువులోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
క్రేన్ సాయంతో కారును బయటకు తీసి, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనపై గాజువాక ట్రాఫిక్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

