వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకి మండలం డోల ఛానల్ వద్ద వంశధార కాలువ, వరి పంట పొలాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ బుధవారం పరిశీలించారు. వర్షాలకు వరి పంటకు నష్టం కలగకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
లోతట్టు గ్రామాల ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసి, అవసరమైన సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్, మండల అధికారులు, పోలీసులు ఉన్నారు.
Comments
Loading comments...

