వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటలుపై వ్యవసాయ శాఖ సర్వే చేపడుతోంది.
మండల వ్యవసాయ సహాయ అధికారి పండరి ఆధ్వర్యంలో సోమవారం జుక్కల్, లొంగన్ గ్రామాల శివారులో పంటల వివరాలను నమోదు చేశారు. పంటల కొనుగోలు సమయంలో ప్రభుత్వం ఈ డేటా ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు రైతులు తమ పొలాల వద్ద ఉండి సర్వేకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

