Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ప్రయాణికులకు షాక్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 10, 2026 4:57 PM జాతీయంGeneral
రైల్వే ప్రయాణికులకు షాక్ - Udayam
రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసిన అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను యాప్‌లోనే చూపించాలని ఇండియన్ రైల్వే స్పష్టం చేసింది. స్క్రీన్‌షాట్లు, పీడీఎఫ్ ప్రతులు, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు ఇకపై అస్సలు చెల్లుబాటు కావని గట్టిగా హెచ్చరించింది. ఇటీవల ఓ మహిళ రైలు బయలుదేరిన తర్వాత వాట్సాప్‌లో టికెట్ చూపించడంతో అధికారులు భారీ ఫైన్ విధించారు. ప్రయాణికులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని రైల్వే శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...