Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెంలో సీఐ కిరణ్ హెచ్చరికలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:43 AM పల్నాడు General
రాజుపాలెంలో సీఐ కిరణ్ హెచ్చరికలు - Udayam
స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురిలో సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ అవగాహన సభ నిర్వహించారు. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. గొడవలకు పాల్పడితే రౌడీషీట్ తెరిచి, ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...