వార్తలకు తిరిగి వెళ్లండి

పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని 36 వార్డులకు 70 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, భద్రత తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే 26న సాయంత్రం 4 గంటల్లోపు తెలియజేయాలని సూచించారు. అదే రోజు ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

