Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పాలన-ప్రగతిపై సమీక్ష: సీనియర్ ఐఏఎస్ అధికారుల నియామకం

Vihar Jun 20, 2026 12:51 PM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago
ప్రజా పాలన-ప్రగతిపై సమీక్ష: సీనియర్ ఐఏఎస్ అధికారుల నియామకం - Udayam Digital
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సమగ్ర సమీక్ష కోసం ప్రభుత్వం జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, కార్యక్రమంపై సిఫార్సులతో కూడిన నివేదికలను ఈ నెల 27లోపు ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను రూపొందించనుంది.

Comments

G
Loading comments...