వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట జంక్షన్ వద్ద కుక్కలు అడ్డురావడంతో ఓ ఆటో అదుపుతప్పి పలువురు గాయపడ్డారు. విషయం గమనించిన ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ వెంటనే స్పందించారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా బాధితులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్వయంగా ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి చేర్చారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

