వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానాలోని పంచకుల సంస్కృతి మోడల్ స్కూల్‌లో ఆరేళ్ల ఎల్‌కేజీ బాలికపై ఎనిమిదేళ్ల 3వ తరగతి విద్యార్థి రాళ్లు, పూలకుండీతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలికను గదిలోకి ఈడ్చుకెళ్లి డెస్క్‌కు తల బాది కిందపడేసి తన్నడంతో తీవ్రంగా గాయపడింది.
ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

