Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితుడికి రూ.10 వేల సాయం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:38 PM శ్రీకాకుళంGeneral
ప్రమాద బాధితుడికి రూ.10 వేల సాయం - Udayam
మెళియాపుట్టి మండలం సవర చీపురుపల్లి గ్రామానికి చెందిన సవర వినోద్‌కుమార్‌ను లోవకుమారి, సీనియర్ నాయకుడు సవర రామ్మూర్తి ఆదివారం పరామర్శించారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్న ఆయనను కలిశారు. వినోద్‌కుమార్‌కు రూ.10 వేల నగదు, పండ్లు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో లక్ష్మీపురం కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...