Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరపాలి: షర్మిల

Follow Udayam on Google
Harika Oct 26, 2026 1:12 PM అమరావతిGeneral
బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరపాలి: షర్మిల - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు అధికార కూటమి బలవంతంతో జరిగాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 16 మున్సిపాలిటీలు, 639 వార్డులు సహా పలు స్థానాల్లో ప్రజాస్వామ్య హక్కులు కాలరాశారని విమర్శించారు. బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోవాలని, ఫలితాలను నిలిపివేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని షర్మిల డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...