వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన అనుపట్ల కిరణ్‌కుమార్ (21) ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన యువతిని పెళ్లాడిన అతడిని కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు.
ఈ నెల 18న ఈసీఐఎల్ కమలానగర్‌లోని లాడ్జ్‌లో గది తీసుకున్న కిరణ్‌కుమార్ 19న మృతిచెందిన స్థితిలో కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

