వార్తలకు తిరిగి వెళ్లండి

సోమల మండలం పొదలకుంటపల్లి పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

