Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీ డీఎస్పీ పేరుతో ఈఈకి మోసం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 13, 2026 10:00 AM ఏలూరుGeneral
ఏసీబీ డీఎస్పీ పేరుతో ఈఈకి మోసం - Udayam
ఏలూరు నగరపాలక సంస్థ ఈఈ సురేంద్రబాబును ఏసీబీ డీఎస్పీగా పరిచయం చేసుకున్న అగంతకుడు బెదిరించి రూ.లక్ష ఆన్‌లైన్‌లో పంపించుకున్నాడు. అవినీతి ఆరోపణలపై దాడి చేయబోతున్నామని, విచారణ లేకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో భయపడిన ఈఈ రూ.లక్ష పంపించారు. అనంతరం అగంతకుడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...