వార్తలకు తిరిగి వెళ్లండి
త్వరలో మార్కెట్లోకి 'ప్లాస్టిక్' నోట్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్కెట్లోకి త్వరలోనే సరికొత్త పాలీమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ నోట్ల స్థానంలో ప్రాథమికంగా కేవలం రూ. 10, రూ. 20 విలువైన నోట్లను తీసుకురానున్నారు.
ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే, 2027 నాటికి అన్ని రకాల కరెన్సీ నోట్లను పాలీమర్ రూపంలో లాంచ్ చేయనున్నారు. ఇవి వచ్చినా పాత నోట్లు రద్దవ్వవని, ఎక్కువ కాలం మన్నిక కోసమే ఈ నిర్ణయమని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...