Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ రహిత గ్రామానికి యువ యూత్ చొరవ

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 9:12 AM జగిత్యాలGeneral
ప్లాస్టిక్ రహిత గ్రామానికి యువ యూత్ చొరవ - Udayam
భీమారం మండలం ఒడ్యాడ్ లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు యువ యూత్ ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్‌ను సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ అభినందించారు. స్టీల్ ప్లేట్లు, గ్లాసులను గ్రామంలోని శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఇతర యువజన సంఘాలు కూడా యువ యూత్‌ను ఆదర్శంగా తీసుకుని గ్రామాభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. మ్యాకల మహేందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...