వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన జయవరపు వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ తన పింఛన్ సమస్యపై సోమవారం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. 2017లో ప్రమాదంలో వెన్నుపూస, కాళ్లు చచ్చుబడటంతో రూ.15 వేల పింఛన్ అందించడంలో గ్రామ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీకోసం కార్యక్రమంలో అర్జీ సమర్పించేందుకు వచ్చిన బాధితుడి సమస్యను సబ్ కలెక్టర్ స్వయంగా తెలుసుకుని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

