Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురంలో 47.69% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:29 PM గుంటూరుGeneral
ఫిరంగిపురంలో 47.69% పోలింగ్ - Udayam
ఫిరంగిపురం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మండలంలోని 60 పోలింగ్ కేంద్రాల్లో 53,110 మంది ఓటర్లకు గాను మధ్యాహ్నం ఒంటిగంట వరకు 25,329 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 47.69 శాతం పోలింగ్ నమోదైంది. గొల్లపాలెంలో అత్యధికంగా 55.79 శాతం, గుండాలపాడులో 55.29 శాతం పోలింగ్ నమోదైంది. మునగపాడులో అత్యల్పంగా 15.96 శాతం నమోదైంది.

Comments

G
Loading comments...