వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరిందని పెద్దకొత్తపల్లి మండల మాజీ జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ అన్నారు. మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన బడే కల్పన–రాజు యాదవ్ దంపతుల నూతన గృహప్రవేశ వేడుకకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భయ్యా ఆంజనేయులు, దాసర్ల శివుడు, కొమ్ము నిరంజన్, ఘనముని స్వామి పాల్గొన్నారు.
Comments
Loading comments...

