వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యాసంస్థలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చడంపై ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్ కుమార్ తెలిపారు. సోమవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపారు.
హై లెవల్ కమిటీ నివేదికను బహిర్గతం చేసి, జీవో 97కు సవరణ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయని తెలిపారు.
Comments
Loading comments...

