Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో దేశ ప్రగతిని శాసించనున్న మన డేటా: కేంద్ర మంత్రి

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 29, 2026 3:00 PM జాతీయంGeneral
మరో దేశ ప్రగతిని శాసించనున్న మన డేటా: కేంద్ర మంత్రి - Udayam
నేషనల్ స్టాటిస్టిక్స్ డే సందర్భంగా కేంద్ర గణాంకాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వం సాధించే ప్రగతికే కాకుండా, పొరుగు దేశాలు మరియు మూడో ప్రపంచ దేశాల అభివృద్ధిని సరైన దిశలో నడిపించడానికి భారతదేశ విశ్వసనీయమైన డేటా ఎంతో కీలకం కానుందని ఆయన స్పష్టం చేశారు. అసంపూర్ణ సమాచారానికి తావులేకుండా అత్యంత ఖచ్చితమైన గణాంకాలను అందించడంపై ప్రధాని మోదీ, పీఎంఓ అత్యంత నిశితంగా ఉన్నారని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...