వార్తలకు తిరిగి వెళ్లండి
మత్స్యకారులకు మహారాష్ట్ర సర్కారు షాక్

మహారాష్ట్రలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై విధించే వార్షిక రుతుపవన చేపల వేట నిషేధాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి నితీష్ రాణే సోమవారం అధికారిక ప్రకటన చేశారు.
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో మత్స్య సంపద పునరుత్పత్తి దెబ్బతినకుండా ఉండేందుకే ఈ గడువును పెంచినట్లు మంత్రి వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్లపై ఈ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి.
Comments
Loading comments...