వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్ మండలం మంద బొగడ గ్రామంలో శుక్రవారం పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, అంగన్‌వాడీ పిల్లలకు అవసరమైన పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించారు.
గర్భిణులు, చిన్నారులు రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్ సంకాబాయి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాబూలాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

