వార్తలకు తిరిగి వెళ్లండి
9వ తరగతిలో మూడో భాష వద్దు: సుప్రీంకోర్టు

9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ కీలక దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ మూడు భాషల విధానంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. చిన్న తరగతుల నుంచే బోధిస్తే అలవాటు పడతారని, ఈ విధానంపై కేంద్రం పునరాలోచించాలని కోర్టు సూచించింది.
Comments
Loading comments...