వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
లౌకికవాద ఓటర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, వారు రాజ్యాంగాన్ని సైతం గౌరవించడం లేదని ఆరోపించారు. అధికారంలో శాశ్వతంగా కొనసాగేందుకు ఆ పార్టీ ఏ స్థాయికైనా వెళ్తుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Loading comments...

