Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర ధరలు తగ్గించాలని ప్రొద్దుటూరులో నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:39 PM కడపGeneral
నిత్యావసర ధరలు తగ్గించాలని ప్రొద్దుటూరులో నిరసన - Udayam
నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ధరల పెరుగుదలను అరికట్టాలని శేఖర్, ముంతాజ్ బేగం ఎమ్మార్వో ఉదయభాస్కరరాజుకు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.

Comments

G
Loading comments...