Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్భగూడెంలో పులి బంధానికి అటవీశాఖ కొత్త వ్యూహం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 05, 2026 12:22 PM ఏలూరుGeneral
దర్భగూడెంలో పులి బంధానికి అటవీశాఖ కొత్త వ్యూహం - Udayam
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తున్నారు. పులిని ఒకే మార్గంలోకి రప్పించేందుకు నాలుగు వైపులా వలలు, రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్‌ను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...