వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్కొండ MRO కార్యాలయంలోని ఆధార్ కేంద్రం నిర్వాహకుడిని మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన సమాధానాలు ఇవ్వకుండా ప్రజల సమయాన్ని వృథా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చిన వారికే పనుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

