Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి తరానికి గురజాడ రచనలు ఆదర్శం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:48 PM అనకాపల్లి General
నేటి తరానికి గురజాడ రచనలు ఆదర్శం - Udayam
మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ రచనల్లోని సామాజిక చైతన్యం, మానవతా దృక్పథం నేటి తరానికి ఆదర్శనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారామ్, తహశీల్దార్ రమాదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...