Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గోపికను పరామర్శించనున్న జగన్

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:54 AM అమరావతిGeneral
నేడు గోపికను పరామర్శించనున్న జగన్ - Udayam
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాలిక గోపికను మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపికను మధ్యాహ్నం 2.15 గంటలకు కలవనున్నారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.

Comments

G
Loading comments...